Ap And Ts Postal Jobs In Telugu

హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించి పోస్టల్ ఆఫీసుల్లో 344 Executive పోస్టులను భర్తీ చేయడానికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.

GDS లుగా పని చేస్తున్నవారికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 2 సంవత్సరాల అనుభవం కలిగినవారికి అవకాశం ఉంటుంది. 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లికేషన్ చేసుకోవాలి. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ చేసుకునే తేదీలు ఇవే :

  • పోస్టల్ శాఖ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ : 11th అక్టోబర్ 2024ఆన్లైన్ అప్లికేషన్
  • ఆఖరు తేదీ : 31st అక్టోబర్ 2024

ఉద్యోగాల వివరాలు :

పోస్టల్ శాఖకు సంబందించిన ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి 344 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. GDS లుగా పని చేస్తూ 2 సంవత్సరాల అనుభవంతో పాటు ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

వయసు :

20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్: పోస్టల్ శాఖ IPPB నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం కలిగిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు. : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు ₹750/- ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.

శాలరీ : రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- శాలరీ చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

ఎలా Apply చేసుకోవాలి : ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి వివరాలు చుసిన తర్వాత ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్స్ ఆధారంగా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా పోస్టల్ ఉద్యోగాలకు పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోగలరు.

Notification link

Apply Link