Notification for Teacher Posts in Army Public Schools

తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 139 ఉపాధ్యాయ పోస్టులు సికిందరాబాద్ (ఆర్కేపీ) సికిందరాబాద్ (బొల్లారం), గోల్కొండల్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఉపాధ్యాయుల నియామకం జరిగే సబ్జెక్టులు: బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జాగ్రఫీ, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, సంస్కృతం, ఫిజికల్ ఎడ్యుకేషన్.

1. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ 50 శాతం మార్కులతో పాసవ్వాలి.

2. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): గ్రాడ్యుయేషన్, బీఈడీ 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి.’

3. ప్రైమరీ టీచర్ (పీఆర్టీ): గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డీఈఐ ఈడీ/ బీఈఐఈడీ 50 శాతం మార్కులతో పాసవ్వాలి. లేదా బీఈడీ, ఆరు నెలల పీడీపీఈటీ/ బ్రిడ్జ్ కోర్సు 50 శాతం మార్కు లతో పూర్తిచేయాలి.

• ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్టుకు హాజరుకావడానికి సీటెట్/టెట్ తప్పనిసరికాదు. అయితే నియామక సమయానికి సీటెట్/టెట్ అర్హత ఉండాలి.

• ఆన్లైన్ స్క్రీన్ టెస్ట్ జరిగిన 21 రోజుల తర్వాత స్కోర్ కార్డ్ అందుబాటులో ఉంటుంది. వెబ్సైట్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసు కోవాలి.

వయస్సు 01.04.2024 నాటికి అనుభవంలేనివారు 40 ఏళ్ల లోపు, అనుభవజ్ఞులైతే 57 ఏళ్ల లోపు ఉండాలి.

అర్హతలు ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకూ పోటీ పడొచ్చు. ప్రతి పోస్టుకూ విడిగా దరఖాస్తు చేయాలి.

ఎంపిక ఎలా? ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

• ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. దీంట్లో సబ్జెక్టు ఆధారిత ప్రశ్నలు అడుగుతారు.

• ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు.

• పీజీటీ పోస్టులకు ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-ఏలో బేసిక్ జీకే, కరెంట్ అఫైర్స్, సెక్షన్- బీలో పెడగాజి, కరిక్యులం-ఎడ్యుకేషన్ పాలసీ మేటర్స్, సెక్షన్-సేలో అకడమిక్ ప్రొఫిషియెన్సీ ప్రశ్నలు ఇస్తారు.

• టీజీటీ పోస్టులకు సెక్షన్-ఏలో బేసిక్ జీకే-కరెంట్ అఫైర్స్, సెక్షన్-బీలో పెడగాజి, కరిక్యులం-ఎడ్యుకేషన్ పాలసీ మ్యాటర్స్ సెక్షన్-సీలో అకడమిక్ ప్రొఫిషియన్సీ ప్రశ్నలు అడుగుతారు.

• టీజీటీ పోస్టులకు సెక్షన్-ఏలో బేసిక్ జీకే-కరెంట్ అఫైర్స్, సెక్షన్-బీలో పెడగాజి, కరిక్యులం-ఎడ్యుకేషన్ పాలసీ మ్యాటర్స్ నెక్షన్-సీలో అకడమిక్ ప్రొఫిషియన్సీ ప్రశ్నలు అడుగుతారు.

• పీజీటీ పోస్టులకు సెక్షన్-ఏలో బేసిక్ జీకే-కరెంట్ అఫైర్స్, సెక్షన్-బీలో పెడగాజి, కరిక్యులం-ఎడ్యుయేషన్ పాలసీ మేటర్స్, సెక్షన్-సీలో అకడమిక్ ప్రొఫిషియన్సీ ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు మూడు పరీక్ష కేంద్రా లను ఎంచుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: రూ.385.

దరఖాస్తుకు చివరి తేదీ: 25.10.2024

వరీక్ష తేదీలు: నవంబరు 23, 24

ఫలితాల వెల్లడి: 10.12.2024

Web site : https://www.awesindia.com/