ఈ రోజు AP హై కోర్టులో DSC – 2025లో Normalization మీద వేసిన కేసుకి సంబంధించిన వాదనలు జరిగాయి…
👉 Normalization మీద కౌంటర్ వేయడానికి Govt లాయర్ కి వారం రోజులు సమయం ఇచ్చారు. కాని ఇప్పుడు DSC Result మీద stay ఇచ్చారా, లేదా అనేది తెలియడం లేదు. కోర్టు ఆర్డర్ కాపీను ఈ రోజు సాయంత్రానికి websiteలో upload చేస్తారు.
🔥 Dsc result మీద stay ఇస్తే ఇప్పట్లో result రావడం కష్టమే…ఒకవేళ ఏ విధమైన stay ఇవ్వకపోతే, మరో 2, 3 రోజుల్లో results వస్తాయి…!? పోస్టింగ్ ఇచ్చేలోపు, ప్రభుత్వం court కి సరైన సమాధానం చెప్పవలసి ఉంటుంది…DSC పోస్టింగ్స్ పై సందిగ్ధం..
తప్పుల తడకగా డీఎస్సీ బయాలజీ షిఫ్ట్-2 ప్రాథమిక కీ..
🔯కాకినాడ నగరం, న్యూస్టుడే:
🔰మెగా డీఎస్సీ-2025లో భాగంగా జూన్ 10న నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ షిఫ్ట్-2 పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీలో తప్పులు దొర్లాయని అభ్యర్థులు వాపో తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ తుది కీ లోనూ ఎటువంటి మార్పూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఈ పరీక్షకు సంబంధించి 14 నుంచి 16 ప్రశ్నల వరకు తప్పులు దొర్లినట్లు వారు చెబుతున్నారు. ఫిష్ట్ -2లో రాష్ట్ర వ్యాప్తంగా 9వేల మంది పరీక్ష రాశారని, తుది కీలో అభ్యంతరాలను సరిగా పరిశీలించనందున తామంతా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. దీనిపై మంగళగిరిలోని విద్యాభవన్కు మంగళవారం పలువురు అభ్యర్థులు వెళ్లి డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డిని కలిసి ఆధారాలతో వివరించినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.