LIC Golden Jubilee Scholarship 2025

ఇంటర్, డిగ్రీ, ఆపై ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించేం దుకు ఎల్ఎసీ ముందుకొచ్చింది. ఉన్నత విద్యనభ్యసించి జీవితంలో స్థిరపడాలనుకునే విద్యార్థులు అవ కాశాన్ని సద్వినియోగం చేసుకునేం దుకు ఇదే సరైన తరుణం.

పథకం : ఎస్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్-2025

లక్ష్యం: నిరుపేద కుటుంబాల్లోని పిల్లల ఉన్నత చదువుకు భరోసా కల్పించడం. విద్యతో వారు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా ప్రోత్సహించడం.

మూడు రకాల ఉపకార వేతనాలు: గడిచిన మూడు విద్యా సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ 60 శాతం మార్కులతో పూర్తి చేసిన విద్యార్థులు 2025-26 విద్యా సంవ త్సరం డిగ్రీ, ఎంబీబీఎస్, బీఏఎం ఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్, బీఈ, బీటెక్, బీఆర్క్, డిప్లొమా, ఒకేషనల్, ఐటీఐ కోర్సులు చదివేం దుకు సాయం అందిస్తారు. వైద్య విద్యకు ఏడాదికి రూ.40 వేలు, ఇంజినీరింగ్కు రూ.30 వేలు ఇస్తారు. రెండో విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. అలాగే పదో తరగతి 60 శాతం మార్కులతో పూర్తి చేసిన వారు మొదటి సంవత్సరం ఇంటర్మీడి యట్, డిప్లొమా, పాలిటెక్నిక్, ఐటీఐ చదివేందుకు రూ. 20 వేలు సాయం చేస్తారు. మూడో ఉపకార వేతనం బాలికల చదువును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా అంద జేస్తారు. పదో తరగతి 60 శాతం మార్కులతో పూర్తి చేసిన బాలికలు ఇంటర్మీడియట్, డిప్లొమా, ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసేందుకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున అందిస్తారు.

ప్రామాణికం ఇలా : మూడురకాల ఉపకార వేతనాలు పొందేందుకు కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.50 లక్షల్లోపు ఉండాలి.

ఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ : ఔత్సాహికులు ఆన్ లైన్లో తమ దరఖాస్తులను https:///licindia.in.పంపాలి.

చివరి గడువు : సెప్టెంబరు 22వ తేదీ

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి

click here

న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన All Educational Updates అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి
https://t.me/alleducationalupdates1

మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫ్రిడ్జ్ ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ ఫోన్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఇలా ఏవైనా గాని చాలా అంటే చాలా తక్కువకే కొనాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
https://t.me/KbrGowthamDeals